ఆది మనసు మార్చుకున్నారా?

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆయన రెండు గంటల పాటు చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతున్న [more]

Update: 2019-09-04 04:05 GMT

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆయన రెండు గంటల పాటు చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ పెద్దలను కూడా ఆదినారాయణరెడ్డి కలిశారు. త్వరలోనే బీజేపీలో చేరతారని భావిస్తున్న తరుణంలో చంద్రబాబునాయుడిని ఆదినారాయణరెడ్డి కలవడం పార్టీలో చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరేందుకు ఆదినారయణరెడ్డి సంశయిస్తున్నారని, టీడీపీలోనే కొనసాగేందుకు ఆదినారాయణరెడ్డి నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమావేశంలో కడప జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, వివేకానందరెడ్డి హత్య కేసు వంటివి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News