తాగి వస్తే తాట తీస్తామంటున్నారే

లాక్ డౌన్ తర్వాత పోలీసులు మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్యం తాగి రోడ్ మీదకు వస్తున్న వారి తాట ను పోలీసులు తీస్తున్నారు. [more]

Update: 2021-07-28 08:01 GMT

లాక్ డౌన్ తర్వాత పోలీసులు మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్యం తాగి రోడ్ మీదకు వస్తున్న వారి తాట ను పోలీసులు తీస్తున్నారు. కరోనా ఉదృతంగా ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ డ్రింక్ అండ్ డ్రైవ్ ను చేపడుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిని కోర్టులో హాజరు పరిచారు. 353 మందికి 20 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది . అధిక మోతాదులో మద్యం సేవించి రోడ్డు మీదికి వచ్చిన వీరికి 20 రోజులు జైలు శిక్ష ఖరారు చేసినట్లు కోర్టు పేర్కొంది. మరోవైపు 353 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేయాలంటూ సైబరాబాద్ పోలీస్ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు.

Tags:    

Similar News