కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణించారు. ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి [more]

;

Update: 2020-11-25 02:21 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణించారు. ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అహ్మద్ పటేల్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ పటేల్ కరోనా వైరస్ కారణంగా శరీరంలోని అవయవాలు అన్నీ దెబ్బతిన్నాయి. అక్బోబరు 1వ తేదీన అహ్మద్ పటేల్ కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజులుగా ఆయనకు అత్యవసర చికిత్సను వైద్యులు అందిస్తున్నారు. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన అహ్మద్ పటేల్ మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News