అఖిలప్రియకు షాక్….!!!

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియకు షాక్ తగలనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీని వీడనున్నారు. ఆయన గత కొంతకాలంగా [more]

Update: 2018-12-29 09:52 GMT

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియకు షాక్ తగలనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీని వీడనున్నారు. ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని అసహనానికి గురైనా రాంపుల్లారెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకున్నారు. టీడీపీని వీడాలన్న నిర్ణయానికి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఆయన యోచిస్తున్నారు. తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందన్న దానిపైనే ఆయన వైసీపీలో చేరతారని సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీనియర్ నేత పార్టీని వీడటం ఖచ్చితంగా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పకతప్పదు.

Tags:    

Similar News