ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు..నేడు విచారణకు హాజరు

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాజధాని అమరావతి [more]

Update: 2021-03-18 01:09 GMT

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు. నేడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఐడీ అధికారులు విచారణ చేయనున్నారు. సీఆర్పీసీ 160 కింద సీఐడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News