జేఏసీ బస్సు యాత్రకు బ్రేక్
అమరావతి జేఏసీ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని జేఏసీ నిర్ణయించింది. 13 జిల్లాల్లో బస్సు యాత్రను [more]
అమరావతి జేఏసీ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని జేఏసీ నిర్ణయించింది. 13 జిల్లాల్లో బస్సు యాత్రను [more]
అమరావతి జేఏసీ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని జేఏసీ నిర్ణయించింది. 13 జిల్లాల్లో బస్సు యాత్రను జరిపి రాజధాని అమరావతికి మద్దతు కూడ గట్టాలని జేఏసీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు ఈ బస్సుయాత్రకు జెండాను ఊపి ప్రారంభించాల్సి ఉంది. అయితే జేఏసీ తలపెట్టిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. బస్సులను షెడ్లలోనే పోలీసులు నిలిపివేశారు. బస్సుయాత్ర ప్రారంభం కావాంటే ఇటు ఆర్టీఏ, అటు పోలీసుల అనుమతి కావాలంటూ పోలీసులు అడ్డుకోవడంతో బస్సు యాత్ర ప్రారంభం కాలేదు. దీనిపై అమరావతి జేఏసీ నేతలు మండిపడుతున్నారు.