పొత్తు కోసం బాబు పాట్లు చెప్పిన అమిత్ షా
2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రధాని అవుతారని గుర్తించిన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం కాళ్లావేళ్లాపడ్డారని బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం [more]
2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రధాని అవుతారని గుర్తించిన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం కాళ్లావేళ్లాపడ్డారని బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం [more]
2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రధాని అవుతారని గుర్తించిన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం కాళ్లావేళ్లాపడ్డారని బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బీజేపీ ప్రజాచైతన్య బస్సుయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… 1998లో కూడా వాజ్‌పయ్ ప్రధాని అవుతారని తెలిసి బీజేపీతో చేతులు కలిపారని, 2004లో బీజేపీ ఓడిపోగానే బీజేపీతో స్నేహం మానుకొని కొత్తవారితో జతకట్టారని ఆరోపించారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు పదేళ్ల సమయం ఉన్నా తాము ఐదేళ్లలోనే చాలా హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థలు ఏపీకి కేటాయించామని పేర్కొన్నారు. కేవలం అవినీతి ఆరోపణల నుంచి తప్పుకునేందుకే బీజేపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 2019లో మోదీ కచ్చితంగా మరోసారి ప్రధాని అవుతారని, అప్పుడు చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలోకి వస్తారని పేర్కొన్నారు.