భార్యకు సిజేరియన్‌.. ఐదువేల కోట్లకు ఎన్నారై దావా

తన మానసిక అనారోగ్యానికి కారణమైందని, ఓ ప్రవాస భారతీయుడు ఆస్ట్రేలియాలోని ఓ ఆస్పత్రిపై కేసు వేశారు. ప్రసవ సమయంలో తన భార్యకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేశారని, ఆ శస్త్ర చికిత్సను తాను కళ్లారా చూసి, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని, ఆ గాయానికి గాను తనకు ఒక బిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో ఐదువేల కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించాడు. అయితే మానసిక రుగ్మతను గాయంగా పరిగణించలేమని... కోర్టు ఎన్నారై విన్నపాన్ని తోసి పుచ్చింది.

Update: 2023-09-19 08:40 GMT

తన మానసిక అనారోగ్యానికి కారణమైందని, ఓ ప్రవాస భారతీయుడు ఆస్ట్రేలియాలోని ఓ ఆస్పత్రిపై కేసు వేశారు. ప్రసవ సమయంలో తన భార్యకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేశారని, ఆ శస్త్ర చికిత్సను తాను కళ్లారా చూసి, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని ఆయన ఆరోపించారు. ఆ గాయానికి గాను తనకు ఒక బిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో ఐదువేల కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించాడు. మానసిక రుగ్మతను గాయంగా పరిగణించలేమని... కోర్టు ఎన్నారై విన్నపాన్ని తోసి పుచ్చింది.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కొప్పుల అనిల్‌.. రాయల్‌ విమెన్స్‌ హాస్పిటల్‌పై ఐదువేల కోట్లకు నష్టపరిహార దావా వేశారు. 2018 జనవరిలో ఆయన భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ సమయంలో జరిగిన సిజేరియన్‌ ఆపరేషన్‌ను ఆయన స్వయంగా వీక్షించారు. శస్త్ర చికిత్సను చూసేలా వైద్యులు తనను అనుమతించారని, ప్రోత్సహించారని అనిల్‌ ఆరోపించారు. ఆపరేషన్‌ సమయంలో తన భార్య అంతర్గత భాగాలు, రక్తం చూసి మనో రుగ్మతకు గురయ్యాన కొప్పుల చెప్పారు. సర్జరీ ప్రక్రియకు సాక్షిగా ఉన్నందుకు... తదనంతర కాలంలో తన వివాహ బంధం కూడా దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నష్టానికి తనకు ఆస్పత్రి నష్టపరిహారం చెల్లించాలని అనిల్‌ డిమాండ్‌ చేశారు. విక్టోరియా సుప్రీం కోర్టు అనిల్‌ వాదనతో ఏకీభవించలేదు. ‘కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నా’రంటూ కేసును డిస్మిస్‌ చేసింది. ’ఈ కేసులో బాధితుడికి ఎలాంటి తీవ్ర గాయాలు కానీ, ఆర్థికంగా ఎలాంటి నష్టమూ కానీ జరగలేదు. మనో రుగ్మతను తీవ్ర గాయం కింద పరిగణించలేమ’ని కోర్టు వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News