"ఆనం" ఇక అక్కడ పోటీ చేయరా?

ఆనం రామనారాయణరెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది.

Update: 2023-03-27 03:22 GMT

ఆనం రామనారాయణరెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. మరోసారి ఆయన పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరిన ఆనం పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో వైసీపీలో చేరి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ అక్కడ మంత్రి పదవి దక్కలేదు.మరోసారి పోటీ చేసి నెగ్గి నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబం ట్రాక్ రికార్డును మళ్లీ లైన్ లోకి తేవాలనుకుంటున్నారు. ఆయనకు అచ్చి వచ్చిన నియోజకవర్గం ఆత్మకూరు. అక్కడ అయితే సునాయాసంగా విజయం సాధిస్తానన్న ధీమాను ఆనం తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి ఆత్మకూరుకు ఈసారి మారిపోక తప్పదు. వెంకటగిరిలో పోటీ చేసి టెన్షన్ పడే కన్నా తనకు పట్టున్న నియోజకవర్గం ఆత్మకూరు అయితేనే బెటర్ అని ఆనం భావిస్తున్నారని తెలిసింది.

ఆత్మకూరు నుంచే...
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అగ్రనేతతో టచ్ లోకి వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నారు. అంతకు ముందుగానే ఆత్మకూరు టిక్కెట్ ను కన్ఫర్మ్ చేసుకున్నారన్న టాక్ కూడా సింహపురిలో వినిపిస్తుంది. ఆత్మకూరు అయితేనే తాను మేకపాటి కుటుంబాన్ని ఎదుర్కొనగలనని కూడా ఆనం చెప్పినట్లు తెలిసింది. నెల్లూరు టీడీపీలో మరొక నియోజకవర్గం కూడా వేకెంట్ గా లేకపోవడం ఆనంకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఆత్మకూరు ఇప్పటికే ఉన్న తన పరిచయాలు, క్యాడర్ ను కూడా ఆనం రెడీ చేసినట్లు చెబుతున్నారు. 2009లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మంత్రిగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కూడా. తనకు వ్యక్తిగత ఓటు బ్యాంకు కూడా ఉందని ఆనం విశ్వసిస్తున్నారు.
పార్టీలో ప్రత్యర్థులు కూడా...
టీడీపీకి కూడా సరైన అభ్యర్థి లేరు. ప్రతి ఎన్నికకు అభ్యర్థులను మార్చి మార్చి పోటీ చేయిస్తుండటం కూడా ఆ పార్టీకి కలసి రావడం లేదు. అయితే టీడీపీకి చెందిన బలమైన సామాజికవర్గం కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. అయినా ఆత్మకూరులో ఒకే ఒక్కసారి టీడీపీ గెలిచింది. 1994లో టీడీపీ నుంచి కొమ్మి లక్ష్మయ్య నాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత ఇక్కడ గెలుపు అనేదే లేదు. అందుకే 2019 ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్యను నిలబెట్టారు. 2014లో మురళి కన్నబాబును పోటీకి దింపారు. ఇలా మారుస్తుండటంతో టీడీపీకి సరైన అభ్యర్థి లేరు. అక్కడ అయితే ఆనం రామనారాయణరెడ్డి తనకు తిరుగుండదని భావిస్తున్నారు.
వ్యక్తిగత ఓటు బ్యాంకు...
పైగా రెండు, మూడు సార్లు మినహాయించి రెడ్డి సామాజికవర్గం నేతలే విజయం సాధించారు. తనపై సస్పెన్షన్ వేయడం సానుభూతిగా మారి తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత అక్కడ వైసీపీ బలహీనపడిందన్న అంచనాలో ఉన్నారు. జగన్ మరోసారి మేకపాటి కుటుంబానికే అక్కడ టిక్కెట్ ఇస్తారని, తాను పోటీ చేస్తా ఈసారి కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఖాయమని, తన పాత నియోజకవర్గాన్ని తన సొంతం చేసుకోవచ్చని ఆనం భావిస్తున్నారట. అందుకోసమే అక్కడి నేతలతో తరచూ సమావేశమవుతున్నారని చెబుతున్నారు. ఆనం అక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి కూడా టిక్కెట్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. మొత్తం మీద వెంకటగిరిలోమాత్రం ఈసారి ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేసే అవకాశమే లేదు. ఆత్మకూరుకు షిఫ్ట్ అవ్వడం ఖాయమన్నది ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న టాక్


Tags:    

Similar News