ఒక్క జీవోతో రెండు పరిశ్రమలు

అనంతపురం జిల్లాకు మరో రెండు పరిశ్రమలు రానున్నాయి. గత ప్రభుత్వం విధించిన నిబంధనలను సడలించడంతో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమయింది. కియా మోటార్స్ పరిశ్రమను ఏర్పాటు [more]

Update: 2020-04-26 02:02 GMT

అనంతపురం జిల్లాకు మరో రెండు పరిశ్రమలు రానున్నాయి. గత ప్రభుత్వం విధించిన నిబంధనలను సడలించడంతో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమయింది. కియా మోటార్స్ పరిశ్రమను ఏర్పాటు చేసే సమయంలో అప్పటి ప్రభుత్వం దాని చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకూ ఎలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రెండు పెద్ద పరిశ్రమల ఏర్పాటు నిలిచిపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించింది. దీంతో అనంతపురం జిల్లాలో వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ తో పాటు ఏపీఐఐసీ సహకారంలో ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు ఏర్పాటు కాబోతున్నాయి. వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ వెయ్యి కోట్ల పెట్టుబడిని పెట్టనుంది.

Tags:    

Similar News