తాలిబన్ల చేతిలో ఆప్ఘనిస్థాన్…?

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ ఎక్కువయిపోతున్నాయి. ఆప్ఘాన్ నుంచి బయటపడేందుకు ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టు బయటే నిరీక్షిస్తున్నారు. తాము ఎవరినీ ఏమీ చేయబోమని తాలిబన్లు [more]

Update: 2021-08-22 13:31 GMT

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ ఎక్కువయిపోతున్నాయి. ఆప్ఘాన్ నుంచి బయటపడేందుకు ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టు బయటే నిరీక్షిస్తున్నారు. తాము ఎవరినీ ఏమీ చేయబోమని తాలిబన్లు చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. వీరిలో నేతలు కూడా ఉన్నారు. రాజకీయ నేతలు సయితం దేశం విడిచి వెళ్లేందుకే సుముఖత చూపుతున్నారు. గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన నరేందర్ సిింగ్ ఖస్లా కుటుంబంతో సహా భారత్ కు వచ్చారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే విలపించారు. ఆప్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలో నాశనమయిపోతుందని ఆవేదన చెందారు. ఆప్ఘనిస్థాన్ లో ఇరవై ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఇక కనిపించదని నరేందర్ సింగ్ వాపోయారు.

Tags:    

Similar News