అడ్డుకున్నాడని లారీతో తొక్కించి

తెలంగాణలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది.. కొన్నాళ్లుగా పూర్తి స్తబ్దతగా ఉన్నా ఇప్పుడు మళ్లీ తన కోరలు చాచింది.. తన పొలం నుంచి ఇసుకను రవాణా చేయవద్దని అభ్యంతరం [more]

Update: 2020-07-30 08:00 GMT

తెలంగాణలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది.. కొన్నాళ్లుగా పూర్తి స్తబ్దతగా ఉన్నా ఇప్పుడు మళ్లీ తన కోరలు చాచింది.. తన పొలం నుంచి ఇసుకను రవాణా చేయవద్దని అభ్యంతరం చెప్పిన రైతుని లారీ తో తొక్కించి చంపిన వైనం ఇది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో రాజాపూర్‌ మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో జరిగింది. తన పొలం నుంచి ఇసుక రవాణా చెయొద్దంటూ నర్సింహులు (38), పదే పదే లారీ డ్రైవర్ లకు చెప్తున్నాడు. అయినా కూడా వారు పట్టించుకోలేదు. అంతేకాకుండా దీనికి సంబంధించి పలుమార్లు ఉన్నతాధికారులు కూడా రైతు నరసింహులు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో ఇసుక మాఫియాకు ఆగ్రహం తెప్పించింది. పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రైతు నర్సింహ లారీలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో లారీలకు అడ్డు వచ్చిన నరసింహని తొక్కించి చంపేశారు. ఈ సంఘటన పైన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇసుక మాఫియాకు రెవెన్యూ పోలీసు అధికారుల అండ ఉందని దీని వల్లనే వాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News