వ్యవసాయానికి ప్రాధాన్యత.. మూడు రాజధానులు కూడా?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వంలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు [more]

Update: 2020-06-16 05:26 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వంలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి నియోజకవర్గాల స్థాయిలో 147 వైఎస్ఆర్ వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు గవర్నర్ తెలిపారు. జిల్లా స్థాయిలో 13 ల్యాబ్ లను ఏర్పాటు చేశామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మూడు వేల కోట్ల తో వ్యవసాయ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు గవర్నర్ వివరించారు. ప్రతి గామ సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కరువు పరిస్థితులను అధిగమించేందుకు రెండు వేల కోట్లతో విపత్తు సహాయనిధిని ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. రైతు భరోసాను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇళ్ల స్థలాల పంపిణీ….

ఏడు వేల కోట్ల తో 30 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తామని చెప్పారు. పదిహేను లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. మహిళల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు గవర్నర్ వివరించారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందచేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో రెండు వేల మంది అవసరాలు తీరుస్తున్నాయని చెప్పారు. 11,158 గ్రామ సచివాలయాలు సేవలందిస్తున్నాయని చెప్పారు. 3,876 వార్డు సచివాలయాలున్నాయన్నారు. ఒక్కో సచివాలయంలో పది మంది శాశ్వత సిబ్బంది, నలభై మంది వాలంటీర్లు ఉన్నారని చెప్పారు.

ప్రాజెక్టు పనులు….

సున్నా వడ్డీ పథకంతో 91 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని గవర్నర్ తెలిపారు. రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల సాధికారితక కోసం నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ మహిళలకు రిజర్వేషన్ లు కల్పించామని చెప్పారు. 40 నుంచి 60 ఏళ్ల వయస్సున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా నాలుగేళ్లలో 75 వేలు అందివ్వనున్నట్లు తెలిపారు. జలయజ్ఞం ద్వారా 54 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది వెలిగొండ, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండో దశ, వంశధార, నాగావశలి అనుసంధానం, అవుకు రోండో సొరంగం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. విద్యుతు బకాయీలకు సంబంధించి డిస్కంలకు 17904 కోట్లు కేటాయించామని చెప్పారు. ఏపీఐఐసీ ద్వారా 1466 కంపెనీలకు భూములు కేటయించామని చెపపారు. దీని ద్వారా 11,548 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్ పోర్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. జీఎంఆర్ సంస్థతో 2,300 కోట్ల మేరకు భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నామని చెప్పారు. మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టబోతున్నట్లు కూడా గవర్నర్ వివరించారు.

కరోనా నియంత్రణలో…..

కరోనా నియంత్రణ లో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. మిలియన్ కు పదివేల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని గవర్నర్ చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటికే ఏపీలో 5.5 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. టెస్టింగ్ ల్యాబ్ లను రాష్ట్రంలో ఒకటి నుంచి 13కు పెంచామని గవర్నర్ చెప్పారు. రోజుకు దాదాపు పదిహేను వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఐదు ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయనిచెప్పారు. పరిపాలనకు సంబంధించి మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చామన్నారు. త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసనసభ రాజధాని, కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు.

Tags:    

Similar News