ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. [more]

Update: 2021-06-30 09:05 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు కూడా ఆమోదం తెలిపింది. ఇరవై ఎనిమిది లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చంది. ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుకు ఓకే చెప్పింది. విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తికి, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు 5,990 కోట్ల మేర బ్యాంకు రుణ హామీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ఏడాది ఐటీ విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ సెజ్ కు 81 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News