ఏడు అంశాలపై కేబినెట్

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అధికార వికేంద్రీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. సీఆర్డీఏ ఉప సంహరణ [more]

Update: 2020-01-20 04:08 GMT

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అధికార వికేంద్రీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. సీఆర్డీఏ ఉప సంహరణ చట్టం బిల్లుకు కూడా మంత్రి వర్గం ఆమోదించనున్నట్లు సమాచారం. కేబినెట్ ముందుకు ఏడు అంశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణతో పాటు ప్రాంతాల అభివృద్ధి పై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై విచారణకు లోకాయుక్తకు అప్పగించనున్నారని తెలిసింది. ఈ అంశం టేబుల్ అంశంగా కేబినెట్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం, అమరావతి మెట్రోపాలిటన్ అధారిటీపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. అలాగే రాజధాని రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలన్న అంశంపై కూడా చర్చించనుంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై కూడా కేబినెట్ చర్చించనుంది.

Tags:    

Similar News