జగన్ సీరియస్ .. ఇక్కడ ఈ తలనొప్పి ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో హిజాబ్ వివాదంపై సీరియస్ అయినట్లు తెలిసింది.;

Update: 2022-02-17 06:39 GMT
telugu academy, supreme court , andhra pradesh, telangana
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో హిజాబ్ వివాదంపై సీరియస్ అయినట్లు తెలిసింది. కర్ణాటక నుంచి ఏపీకి హిజాబ్ పాకడంతో జగన్ ఉన్నతాధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో అటువంటి వాటికి తావు లేదని, ఈ వివాదం ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు సమాచారం. విచారణ జరిపి బాధ్యులైన వారిని శిక్షించాలని కూడా ఆదేశించారు.

కలెక్టర్ చేత....
విజయవాడలోని లయోలా కళాశాలలో హిజాబ్ ధరించారని కళాశాల యాజమాన్యం విద్యార్థినులను లోపలికి అనుమతించలేదు. దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిసింది. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం కళాశాలలో చేరేటప్పుడే నిబంధనలను పాటిస్తామని విద్యార్థులు సంతకం చేస్తారని, తమ కళాశాలలో యూనిఫారం మాత్రమే అనుమతిస్తామని చెబుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో జగన్ సీిరియస్ గా ఉన్నారని తెలిసింది. ఈ వివాదం మరింత ముదరకుండా చూడాలని కూడా అధికారులను గట్టిగానే ఆదేశించినట్లు తెలిసింది.


Tags:    

Similar News