ప్రయాణాలుంటే వాయిదా వేసుకోవడం బెటర్
ఈరోజు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈరోజు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు ఇరవై మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని తెలిపింది. అనకాపల్లి, గుంటూరు కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, వైఎస్సార్ జిల్లాలోని పలుమండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని తెలిపింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44డిగ్రీల నుంచి45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అవసరమైతే తప్ప బయటకు....
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరి అయితే చేయాలని, లేకుంటే వాయిదా వేసుకోవాలని సూచించింది.