ఏపీలో ఫలితాల కోసం ఎంత వెయిటింగ్….??
ఏపీ సీఎం ఎవరో తెలియాలంటే నెలన్నర రోజులు వెయిట్ చేయాల్సిందే. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏప్రిల్ 11వ [more]
ఏపీ సీఎం ఎవరో తెలియాలంటే నెలన్నర రోజులు వెయిట్ చేయాల్సిందే. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏప్రిల్ 11వ [more]
ఏపీ సీఎం ఎవరో తెలియాలంటే నెలన్నర రోజులు వెయిట్ చేయాల్సిందే. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏప్రిల్ 11వ తేదీన శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో ఎన్నికల కౌంటింగ్ మే 23వ తేదీన ఖరారు చేశారు. అంటే ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగితే మే 23వ తేదీ వరకూ ఏపీ రాజకీయ పార్టీలు ఫలితాల కోసం నిరీక్షించాల్సిందే. దాదాపు నెలన్నర పాటు అభ్యర్థుల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ ఫలితాల టెన్షన్ తప్పేట్లు లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లకు ఆఖరి గడువు ఈనెల 25వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 28వ తేదీ వరకూ నిర్ణయించారు. ఏప్రిల్ 11 న పోలింగ్ జరగనుంది.