శ్రీలంకలో మరో బాంబు పేలుడు
శ్రీలంకలో బాంబు పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 9 చోట్ల బాంబు పేలుళ్లు జరగగా ఇవాళ రాజధాని కోలంబోలోని సవోయ్ మాల్ వద్ద 10వ బాంబును పేల్చారు ఉగ్రవాదులు. [more]
శ్రీలంకలో బాంబు పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 9 చోట్ల బాంబు పేలుళ్లు జరగగా ఇవాళ రాజధాని కోలంబోలోని సవోయ్ మాల్ వద్ద 10వ బాంబును పేల్చారు ఉగ్రవాదులు. [more]
శ్రీలంకలో బాంబు పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 9 చోట్ల బాంబు పేలుళ్లు జరగగా ఇవాళ రాజధాని కోలంబోలోని సవోయ్ మాల్ వద్ద 10వ బాంబును పేల్చారు ఉగ్రవాదులు. ఓ ద్విచక్ర వాహనంలో బాంబును పెట్టి మాల్ వద్ద పార్కింగ్ చేసి పేల్చివేశారు ఉగ్రవాదాలు. అదృష్టవశాత్తూ పేలుడు సంభవించిన సమయంలో ఘటనా స్థలం వద్ద ప్రజలెవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. శ్రీలంకలో మరిన్ని బాంబులు పేలుళ్లు జరపవచ్చని శ్రీలంక ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు భారత్, అమెరికా కూడా హెచ్చరించింది. శ్రీలంక పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా పేలుళ్లు మాత్రం ఆగడం లేదు. ఇక, బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.