రూ.99 వేలకు టీవీ9 లోగోనే అమ్మేసిన రవిప్రకాశ్..!

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై మరో కేసు నమోదైంది. షేర్ హోల్డర్ల అనుమతి లేకుండానే టీవీ9 లోగోను మీడియా నెక్ట్స్ అనే సంస్థకు రవిప్రకాశ్ విక్రయించినట్లు [more]

Update: 2019-05-17 07:51 GMT

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై మరో కేసు నమోదైంది. షేర్ హోల్డర్ల అనుమతి లేకుండానే టీవీ9 లోగోను మీడియా నెక్ట్స్ అనే సంస్థకు రవిప్రకాశ్ విక్రయించినట్లు టీవీ9 సంస్థ కొత్త యాజమాన్యం గుర్తించింది. టీవీ9 లోగోను కొత్త యాజమాన్యానికి దక్కకుండా రవిప్రకాశ్ కుట్ర చేసినట్లు యాజమాన్యం భావిస్తోంది. దీంతో టీవీ9 డైరెక్టర్ కౌశీక్ రావు ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్ పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై డేటా చోరీ, తప్పుడు పత్రాలు సృష్టించడం, నిధుల మళ్లింపు, తదితర వ్యవహారాన్ని కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు సైతం నిరాకరించింది. దీంతో ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ అరెస్టు తప్పకపోవచ్చు.

Tags:    

Similar News