మహేష్ బాబుకు మరో షాక్..?
మహేష్ బాబు సూపర్ స్టార్ గా సినిమాల్లోనే కాదు బిజినెస్ లోనూ దూసుకుపోతున్నాడు. తాజాగా మహేష్ బాబు ఏషియన్ సునీల్ తో కలిసి మల్టిప్లెక్స్ బిజినెస్ కూడా [more]
మహేష్ బాబు సూపర్ స్టార్ గా సినిమాల్లోనే కాదు బిజినెస్ లోనూ దూసుకుపోతున్నాడు. తాజాగా మహేష్ బాబు ఏషియన్ సునీల్ తో కలిసి మల్టిప్లెక్స్ బిజినెస్ కూడా [more]
మహేష్ బాబు సూపర్ స్టార్ గా సినిమాల్లోనే కాదు బిజినెస్ లోనూ దూసుకుపోతున్నాడు. తాజాగా మహేష్ బాబు ఏషియన్ సునీల్ తో కలిసి మల్టిప్లెక్స్ బిజినెస్ కూడా ప్రారంభించాడు. ఇప్పటికే హైదరాబాద్ నగర నడిబొడ్డున ఏఎంబీ సినిమాస్ అంటూ మహేష్ మాల్టిప్లెక్స్ ని ఓపెన్ చేసాడు. ఆ మల్టిప్లెక్స్ థియేటర్ లో షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఇక అక్కడ కేవలం సినిమా ప్రదర్శనే కాదు.. చాలా సినిమాల చిత్ర బృందాలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళుతున్నాయి కూడా. హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య పట్టణాల్లో ఈ మల్టిప్లెక్స్ బిజినెస్ ని సునీల్ తో కలిసి విస్తరిస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ బాబు ఏఎంబీ సినిమా ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
నోటీసులు ఇచ్చారా..?
అదేమిటంటే… జీఎస్టీ అధికారులు ఈ ఏఎంబీ మల్టీప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారని… జీఎస్టీలో టికెట్స్ ధరలు తగ్గినప్పటికీ.. పాత జీఎస్టీ ప్రకారం ఎక్కువ సొమ్ము వసూలు చేస్తుండడంతో జీఎస్టీ అధికారులు ఏఎంబీ సినిమాస్ కి నోటీసులు ఇచ్చారట. 100 కు పైగా ధర ఉన్న టికెట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దానితో ఆటోమాటిక్ గా సినిమా టికెట్ల ధరలు కూడా తగ్గాయి. కానీ మహేష్ ఏఎంబీ సినిమాస్ వారు మాత్రం ప్రేక్షకుల నుండి 28 శాతం జీఎస్టీతో ఉన్న టికెట్స్ ని విక్రయిస్తుండడంతో జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారపి వార్తలు వచ్చాయి. కానీ ఏషియన్ సునీల్ మాత్రం అలాంటిదేం లేదు.. జీఎస్టీ అధికారులు టికెట్స్ ధరలపై మాకేమి నోటీసులు ఇవ్వలేదంటున్నాడు. జీఎస్టీ అధికారులు తనిఖీ చేసిన మాట వాస్తవమేనని… నోటీసులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నాడు.