భానుప్రియ కేసు లో మరో ట్విస్ట్..!
సినీనటి భానుప్రియ కేసు మరో మలుపు తిరిగింది. భానుప్రియ ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా కు చెందిన ఓ అమ్మాయి పనిమనిషిగా కొన్నేళ్ల నుండి పని చేస్తుంది. అయితే [more]
సినీనటి భానుప్రియ కేసు మరో మలుపు తిరిగింది. భానుప్రియ ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా కు చెందిన ఓ అమ్మాయి పనిమనిషిగా కొన్నేళ్ల నుండి పని చేస్తుంది. అయితే [more]
సినీనటి భానుప్రియ కేసు మరో మలుపు తిరిగింది. భానుప్రియ ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా కు చెందిన ఓ అమ్మాయి పనిమనిషిగా కొన్నేళ్ల నుండి పని చేస్తుంది. అయితే ఇంట్లో తనను భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. ఆ అమ్మాయి తమ ఇంట్లో విలువైన వస్తువులు దొంగిలించిందని అందుకే మేము ఏమంటామో అని ముందుగానే కేసు పెట్టిందని భానుప్రియ మీడియా ముందుకు వచ్చి నిజానిజాలు చెప్పారు. తల్లి ప్రోత్సాహంతో బాలిక నిజంగానే దొంగతనానికి పాల్పడిందని పోలీసులు కూడా తేల్చారు.
అరెస్టు తప్పదా..?
ఈ విషయం ఆ అమ్మాయి కూడా చెప్పింది. నేను ఇది కావాలనే చెసాసని… భానుప్రియ కుటుంబ సభ్యులు తనను బాగానే చూసుకున్నారని చెప్పింది. ఎవరూ తనను వేదించలేదని చెప్పింది. అంతా ఓకే అనుకున్న టైంలో మరో సమస్య వచ్చింది. 14 సంవత్సరాల బాలికను పనిలో పెట్టుకోవడం నేరమని బాలల హక్కుల సంఘం తెలిపింది. దీనిపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం పోలీసులను కోరింది. దీంతో భానుప్రియ అరెస్టు తప్పకపోవచ్చని పోలీసులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.