బ్రేకింగ్ : సీబీఐ వివాదంలో మరో ట్విస్ట్

సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ వర్మకు మళ్లీ షాక్ తగిలింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమైనవేనని హైపవర్ కమిటీ నిర్ధారించి [more]

Update: 2019-01-10 16:39 GMT

సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ వర్మకు మళ్లీ షాక్ తగిలింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమైనవేనని హైపవర్ కమిటీ నిర్ధారించి అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అలోక్ వర్మపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను సెలవుపై పంపించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావును నియమించింది. అయితే, సుప్రీం కోర్టు అలోక్ వర్మను కొనసాగిస్తూ మొన్న తీర్పు చెప్పింది. దీంతో ఆయన మళ్లీ బాధ్యతలు చేపట్టారు. తాను వెళ్లిన తర్వాత సీబీఐలోకి తీసుకువచ్చిన అధికారులు తిరిగి బదిలీ చేశారు. ఇంతలోనే హైపవర్ కమిటీ ఆయనను తొలగించడంతో ఒక్కరోజులోనే అలోక్ వర్మ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఆయన పదవీకాలం జనవరి 31నే ముగుస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News