మార్చి 15 లోపే ఏపీలో ఎన్నికలు

మార్చి పదిహేనవ తేదీ లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం కఠిన చట్టాలను తెస్తూ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. [more]

Update: 2020-02-12 06:55 GMT

మార్చి పదిహేనవ తేదీ లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం కఠిన చట్టాలను తెస్తూ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్టంలో కీలక సవరణలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నగదు, మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయంచింది. అభ్యర్థి ఎవరైనా నగదు, మద్యం పంచుతూ దొరికితే వెంటనే అనర్హత వేటు వేసేలా నిబంధనలను రూపొందించింది. పదమూడు నుంచి 15 రోజులలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సర్పంచ్ ఖచ్చితంగా స్థానికుడై ఉండాలన్న నిబంధనను విధించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఐదు రోజులు, పంచాయతీ ఎన్నికలకు ఏడు రోజులు మాత్రమే ప్రచారం ఉండేలా రూపొందించిన నిబంధనలకు మంత్రి వర్గ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News