బ్రేకింగ్ : ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ. మూడు రాజధానులపై?

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం అత్యవసరంగా సమావేశం అవుతుంది. మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకోనుంది

Update: 2021-11-22 05:08 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం అత్యవసరంగా సమావేశం అవుతుంది. మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. గతంలో ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆ స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ, శాసనమండలిలో ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే అత్యవసరంగా మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పెద్దయెత్తున అమరావతిలో ప్రచారం జరుగుతుంది.

గతంలో ప్రవేశపెట్టిన....
జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని గతంలో శాసనసభలో ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మళ్లీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. శాసన రాజధానిని అమరావతిలో, పరిపాలన రాజధాని విశాఖలో, న్యాయరాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. కానీ ఇందులో మార్పులు చేసి తిరిగి కొత్త బిల్లును ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇప్పుడు శాసనమండలిలోనూ వైసీపీ బలం పెరిగింది.


Tags:    

Similar News