విశాఖలో 394 కోట్లతో…?
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ నిర్ణయం తీసుకునే ముందే విశాఖలో అభివృద్ధి పనులకు పెద్దయెత్తున నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ వివిధ అభివృద్ధి పనుల కోసం [more]
;
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ నిర్ణయం తీసుకునే ముందే విశాఖలో అభివృద్ధి పనులకు పెద్దయెత్తున నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ వివిధ అభివృద్ధి పనుల కోసం [more]
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ నిర్ణయం తీసుకునే ముందే విశాఖలో అభివృద్ధి పనులకు పెద్దయెత్తున నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ వివిధ అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వం మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్లకు విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులను ఇచ్చింది. కాపులుప్పాడ సమీపంలోని బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ. 22.50 కోట్లు, కైలాసగిరి ప్లానిటోరియం కోసం రూ. 37 కోట్లు , సిరిపురం జంక్షన్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ అండ్ వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్.. మ్యూజియం రిసెర్చ్ సంస్థ కోసం రూ. 88 కోట్లు, నాతయ్యపాలెం జంక్షన్ సమీపంలోని చుక్కవాని పాలెంలో రహదారి నిర్మాణం కోసం రూ. 90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ. 40 కోట్లు,
ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణం కోసం రూ. 75 కోట్లు కేటాయిస్తూ జీవో జారీచేసింది.