బ్రేకింగ్ : ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. చుక్కుల భూములపై ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును ఆయన తిరస్కరించారు. 20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన భూమిని [more]

Update: 2019-01-30 06:08 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. చుక్కుల భూములపై ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును ఆయన తిరస్కరించారు. 20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్ముకోకుండా ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది.అయితే, సమస్య పరిష్కరించేలా ఆర్డినెన్స్ లేదని భావించిన గవర్నర్ ఆర్డినెన్స్ ను తిప్పిపంపారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పును గవర్నర్ తప్పుపట్టారు. దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం 2 నెలలు పెట్టడంపైనా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, గవర్నర్ తిప్పిపంపడంతో మరోసారి ఆయనకు ఈ ఆర్డినెన్స్ పంపకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నాలా ఆర్డినెన్సు విషయంలోనూ ఏపీ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ఇటువంటి వివాదమే తలెత్తింది. అయితే, అసైన్ మెంట్ ఆర్డినెన్స్ మాత్రం గవర్నర్ ఆమోదించారు.

Tags:    

Similar News