భూకంపం : వంద మంది మృతి
టర్కీ, సిరియాలలో భూకంపం కారణంగా దాదాపు వంద మంది మరణించినట్లు తెలుస్తోంది.
టర్కీ, సిరియాలలో భూకంపం కారణంగా దాదాపు వంద మంది మరణించినట్లు తెలుస్తోంది. టర్కీలో ఈరోజు తెల్లవారు జామును సంభవించిన భూకంపానికి అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. టర్కీ, సిరియాలలో రిక్టర్ స్కేల్ పై 7.8 భూకంప తీవ్రత నమోదయింది. టర్కీ, సిిరియాలలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో భయానక వాతావరణం అక్కడ నెలకొని ఉందని అధికారులు వెల్లడించారు.
కుప్పకూలిన భవనాలు...
భూకంపం ధాటికి టర్కీలో 52 మంది, సిరియాలో 46 మంది వరకూ మరణించినట్లు తెలుస్తోంది. శిధిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న సందేహంతో వాటిని తొలగించే ప్రక్రియను సహాయ బృందాలు చేపట్టాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. తెల్లవారు జామున ఈ భూకంపం జరగడంతో వందల సంఖ్యలోనే మరణించి ఉండవచ్చన్న అంచనాలు వినపడుతున్నాయి.