రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే ఎలాంటి వ్యూహం అనుసరించాలని చర్చించేందుకు గానూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ సమావేశమయ్యారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు కాసేపటి క్రితమే అసదుద్దిన్ ఓవైసీ ప్రగతి భవన్ కు వచ్చారు. ఎలాగూ కేసీఆర్ కే మద్దతు ఇస్తామని అసదుద్దిన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, బయట నుంచి మద్దతు ఇస్తారా లేదా ప్రభుత్వంలో భాగమవుతారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయిస్తే మాత్రం 70 ఏళ్ల చరిత్రలో ఎంఐఎం మొదటిసారి అధికారంలో భాగమై రికార్డు సృష్టించనుంది. కాగా, ప్రగతి భవన్ కు అసదుద్దిన్ ఓవైసీ బుల్లెట్ నడుపుతూ ఒంటరిగా రావడం ఆసక్తికరంగా మారింది.