తాజ్ మహల్ లోని 22 భూగర్భ గదుల చిత్రాలను విడుదల చేసిన ఏఎస్ఐ

అయోధ్యకు చెందిన డాక్టర్‌ రజనీష్‌ సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో తాజ్‌ మహల్‌లో మూసి..

Update: 2022-05-17 04:15 GMT

న్యూఢిల్లీ : ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం తాజ్ మహల్ చుట్టూ ఎన్నో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే..! ఒకానొక దశలో తాజ్ మహల్ షాజహాన్ కట్టించింది కాదని.. అదొక ఆలయం అంటూ కూడా వాదనలు వినిపించాయి. ఇక తాజ్ మహల్ నేలమాళిగలో 22 తాళం వేసిన గదులు ఉన్నాయని.. అందుకు సంబంధించి విస్తృతమైన చర్చ కొనసాగుతూ ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఈ గదుల లోపల పునరుద్ధరణ పనులను విడుదల చేపట్టింది. జనవరి 2022 లో న్యూస్ లెటర్ ఆధారంగా.. ASI వెబ్‌సైట్‌లో అందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఉంచారు. ఎవరైనా తమ వెబ్‌సైట్‌ లో ఆ ఫోటోలను వీక్షించవచ్చని ఆగ్రా ASI చీఫ్ RK పటేల్ తెలిపారు. పలు నిర్వహణ పనులు చేపట్టగా.. వారికి సంబంధించిన చిత్రాలను సైతం విడుదల చేశారు అధికారులు. నదీ తీరంలో భూగర్భ గదుల నిర్వహణ పనులు చేపట్టామని.. పాడైన, శిథిలమైన లైమ్‌ పాస్టర్‌ను తొలగించి, మరమ్మతులు చేపట్టామని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తెలిపింది. తాజ్‌ మహల్‌ చుట్టూ ఉన్న గేట్‌వేలకు సైతం మరమ్మతులు చేపట్టారు.

ఇటీవల అయోధ్యకు చెందిన డాక్టర్‌ రజనీష్‌ సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 22 గదలను తెరవాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజ్‌ మహల్‌ వాస్తవానికి తేజో మహా శివాలయమని చిత్రకారులు పేర్కొన్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజ్‌మహల్‌పై పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్‌ని మందలిచింది. పిల్‌ను ఎగతాళి చేయవద్దని.. కనీసం అవగాహన లేకుండా.. ఇష్టానుసారం పిల్ వేస్తారా? అని మండిపడింది. ఈ మూసి ఉన్న గదులలో ప్లాస్టర్ మరియు లైమ్ ప్యానింగ్‌తో సహా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు ఫోటోలలో ఉన్నాయి. ఈ గదుల్లో పునరుద్ధరణ పనులకు ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. శనివారం 20 వేల మందికి పైగా పర్యాటకులు తాజ్ మహల్‌ను సందర్శించారు. 13,814 మంది పర్యాటకులు తమ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయగా, 7154 మంది పర్యాటకులు వాటిని ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేశారు.
ఆగ్రాలో తాజ్‌ మహల్‌ కట్టించిన ప్రాంతం జైపూర్‌ పాలకుడు జై సింగ్‌కు సంబంధించిందని.. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయని రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ దియా కుమారి కూడా ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్‌ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదని.. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News