బూస్టర్ డోస్ ఒమిక్రాన్ పై పనిచేస్తుందా ? నిపుణులు ఏం చెప్తున్నారు ?

బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఆస్ట్రాజెనెకా గురువారం ఓ కీలక విషయాన్ని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై

Update: 2022-01-13 14:08 GMT

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే బూస్టర్ డోస్ లను వేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. బూస్టర్ డోస్ తో ఒమిక్రాన్ ను అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఆస్ట్రాజెనెకా గురువారం ఓ కీలక విషయాన్ని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా బూస్టర్‌ డోసు వాక్స్‌జెవ్రియా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్‌తోపాటు డెల్టా, బీటా, అల్ఫా, గామా వేరియంట్లను ఎదుర్కొనే యాంటీబాడీలను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆస్ట్రాజెనెకా లేదా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు పేర్కొంది. వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ వేరియంట్‌ను బూస్టర్‌ డోసు ఏ మేరకు ఎదుర్కొంటుందన్న అంశాన్ని పరిశీలించేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. మూడు డోసుల వల్ల కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తొలి రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆస్ట్రాజెనెకా బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు నిరూపించాయని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ చీఫ్‌ ఆండ్రూ పొలార్డ్‌ తెలిపారు.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా ట్వీట్‌లో "ఇది ప్రోత్సాహకరమైన వార్త, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ మరియు డైరెక్టర్ ప్రొఫెసర్ సర్ ఆండ్రూ జె పొలార్డ్ ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ఆస్టాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కొత్త డేటా మూడు డోస్‌లు మంచి ప్రభావం చూపించిందని. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా మంచి రక్షణను అందింస్తోంది" అని తెలిపారు. ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కారణంగా వాక్స్‌జెవ్రియా వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో తయారు చేసి సరఫరా చేస్తోంది.


Tags:    

Similar News