జగన్ పై దాడి పక్కా ప్రణాళికతోనే జరిగిందని ప్రత్యక్ష సాక్షి జియ్యాది శ్రీధర్ తెలిపారు. దాడి జరిగిన సమయంలో తాను జగన్ పక్కనే ఉన్నానని, అయితే జగన్ ను మాటల్లో పెట్టి రాజకీయ అంశాలు మాట్లాడి దాడికి శ్రీనివాస్ తెగబడ్డారన్నారు. రెస్టారెంట్ యూనిఫాంలో ఉన్నందున తామెవరమూ అనుమానించలేదన్నారు. జగన్ వద్దకు వచ్చి రాజకీయ అంశాలను మాట్లాడుతూ ఒక్కసారిగా దాడి చేశారన్నారు. ఒకసారి దాడి చేస్తే జగన్ తప్పుకోవడంతో భుజం పై గాయం అయిందని, రెండోసారి దాడి చేస్తుండటంతో పక్కనే ఉన్న వారు అడ్డుకుని కత్తిని స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ ను పట్టుకున్నారని తెలిపారు. దాడి జరిగిన సమయంలో జగన్ వద్ద గన్ మెన్లు ఎవరూ లేరన్నారు.