Vijayawada : బెజవాడకు 9 వేల కోట్ల హెరాయిన్?

ఆఫ్ణనిస్థాన్ నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 9 వేల కోట్ల రూపాయల హెరాయిన్ ను గుజరాత్ పోర్టులో అధికారులు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని [more]

Update: 2021-09-20 04:38 GMT

ఆఫ్ణనిస్థాన్ నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 9 వేల కోట్ల రూపాయల హెరాయిన్ ను గుజరాత్ పోర్టులో అధికారులు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. టాల్కం పౌడర్ పేరిట హెరాయిన్ ను విజయవాడకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ముంద్రా పోర్టులో వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ కు చెందిన రెండు నౌకల్లో 2,988 కిలోల హెరాయిన్ ను గుర్తించారు. ఈ కేసులో గోవిందరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విజయవాడలోని సత్యనారాయణపురానికి చెందిన ఆశి ట్రేడింగ్ కంపెనీకి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలిసింది. మాచవరం సుధాకర్ అనే వ్యక్తి ఈ కంపెనీని ప్రారంభించారు.

Tags:    

Similar News