తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన బ్రిటన్ దేశస్థులను?

హైదరాబాద్ లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసుల ను తిరిగి అధికారులు వెనక్కి పంపించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బ్రిటిష్ ఎయిర్ లైన్స్ లో 136 మంది [more]

Update: 2020-04-18 06:17 GMT

హైదరాబాద్ లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసుల ను తిరిగి అధికారులు వెనక్కి పంపించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బ్రిటిష్ ఎయిర్ లైన్స్ లో 136 మంది ప్రయాణికులు పంపించి వేశారు. లాక్ డౌన్ ప్రకటన వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా బ్రిటన్ దేశస్థులు ఇండియాలో చిక్కుకుపోయారు . వీరందరినీ దశలవారీగా భారత ప్రభుత్వం తిరిగి వారి దేశాలకి పంపించి వేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో ఉండిపోయిన 136 మంది బ్రిటన్ దేశస్థుల ను తిరిగి వారి స్వస్థలానికి పంపించి వేశారు. హైదరాబాద్ బెహరన్ మీదుగా ఈ విమానం లండన్ కి చేరుకుంటుంది. ఈ సందర్భంగా 136 మంది బ్రిటన్ దేశాలకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విమానంలోకి అధికారులు అనుమతించారు. బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో వీరందరూ కూడా తిరిగి పంపించి వేసినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News