మారుతీరావుకు బెయిల్… ఆందోళనలో ప్రణయ్ కుటుంబం

మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులు మారుతీరావు, శ్రవణ్, కరీంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడు నెలల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. [more]

Update: 2019-04-27 08:29 GMT

మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులు మారుతీరావు, శ్రవణ్, కరీంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడు నెలల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. కూతురు అమృత తమ ఇష్టానికి విరుద్ధంగా పెళ్లాడిందనే కోపంతో ప్రణయ్ ను హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మారుతీరావు, ఆయన తమ్ముడు శ్రవణ్, వారి సన్నిహితుడు కరీంను నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిపై పీడీ యాక్ట్ సైతం నమోదు కావడంతో బెయిల్ రావడానికి ఏడు నెలలు పట్టింది. ఇవాళ వారు వరంగల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, మారుతీరావుకు బెయిల్ రావడంతో ప్రణయ్ కుటుంబసభ్యులు మిర్యాలగూడ డీఎస్పీని కలిశారు. తమ కుటుంబానికి మారుతీరావు నుంచి ప్రాణహాని ఉందని, కాబట్టి రక్షణ కలిపించాలని వారు కోరారు.

Tags:    

Similar News