సమర్థత, అవగాహన బిపిన్ కు పదవిని తెచ్చి పెట్టింది
ఇండియన్ ఆర్మీలో చీఫ్ గా పనిచేసిన బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా నియమితులయ్యారు. మూడు దళాలను సమన్వయం చేసుకుంటున్నారు
బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్.. భారత్ కు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా వ్యవహరించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల మధ్య సమన్వయం చేసుకునేందుకు భారత ప్రభుత్వం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి చీఫ్ గా బిపిన్ రావత్ నియమితులయ్యారు. 2019 డిసెంబరు 30 వ తేదీన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా బిపిన్ రావత్ నియమితులయ్యారు. దాదాపు రెండేళ్లు రావత్ ఈ పదవిలో ఉన్నట్లే లెక్క.
ఆర్మీలో పనిచేసి...
ఆయన ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ గా పనిచేశారు. బిపిన్ రావత్ 1958 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ లో జన్మించారు. ఆర్మీలో అనేక రెజ్మెంట్ లో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా పనిచేశారు. 1987లో సైనో ఇండియన్ స్కిర్ మిష్ నుంచి బిపిన్ రావత్ ఆర్మీ జీవితం ప్రారంభమయింది. ఆ తర్వాత ఆయన అంచలంచలుగా ఎదిగి జనరల్ స్థాయికి చేరుకున్నారు. గోర్ఖా రైఫిల్స్ ఐదో బెటాలియన్ లో పనిచేశారు. ఆర్మీ చీఫ్ గా పనిచేశారు.
కార్గిల్ యుద్ధం తర్వాత....
కార్గిల్ యుద్ధం తర్వాత ఎక్కడ లోపం ఉందని పరిశీలించిన తర్వాత నిపుణుల సూచన మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ను ఏర్పాటు చేశారు. థియేటర్ కమాండ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీలను సమన్వయం చేసుకునే బాధ్యత కోసం సీడీఎస్ ను ఏర్పాటు చేశారు. త్రివిధ దళాల అధిపతి ఉండాలని నిర్ణయించారు. అన్ని దేశాలకు సంబంధించి సరిహద్దులపై అవగాహన ఉన్న బిపిన్ రావత్ ను ఈ పదవికి ఎంపిక చేశారు. ప్రభుత్వానికి, త్రివిధ దళాలకు మధ్య సమన్వయకర్తగా పనిచేస్తారు.
రెండోసారి అధికారంలోకి...
అయితే మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రత, సరిహద్దుల్లో సున్నితమైన అంశాల దృష్ట్యా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ను ఏర్పాటు చేశారు. త్రివిధ దళాల అధిపతిగా తొలిసారి నియమితులైన బిపిన్ రావత్ సమర్థవంతంగా తన విధులను నిర్వహించారు. భారత్ లో పదిహేను కమాండంట్ల బాధ్యతను బిపిన్ రావత్ పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి మధులిక మృతి చెందారు. ఆయన ఈ ప్రమాదంలోనుంచి బయటపడటంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.