వద్దని హెచ్చరించినా వెళ్లారట
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ బృందం పోలీసులు వద్దని వారించినా ప్రయాణాన్ని కొనసాగించడమే ప్రమాదానికి కారణం
నీలగిరి కొండల్లో గత మూడు రోజులుగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ బృందం పోలీసులు వద్దని వారించినా తన ప్రయాణాన్ని కొనసాగించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నిన్న హెలికాప్టర్ ప్రమాదం జరిగి బిపిన్ రావత్ తో సహా 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే రావత్ రాక సందర్భంగా స్థానిక పోలీసులు హై అలెర్ట్ చేశారు. కున్నూరు, నీలగిరి పోలీసులు ప్రయాణం వద్దని సూచించారు.
తక్కువ ఎత్తుకు...
అయిని రావత్ బృందం హెలికాప్టర్ లో బయలుదేరింది. ఎక్కువ ఎత్తులో పొగ మంచు కారణంగా కన్పించకపోవడంతో తక్కువ ఎత్తుకు పైలెట్ హెలికాప్టర్ ను తీసుకు వచ్చారు. దీంతో సుల్లూరు నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ఒక చెట్టుకు ఢికొని ప్రమాదం జరిగిందని ప్రాధమిక అంచనాను బట్టి తెలిసింది.
బ్లాక్ బాక్స్ కోసం...
మరోవైపు బ్లాక్ బాక్స్ కోసం ఆర్మీ వెదుకులాట ప్రారంభించింది. బ్లాక్ బాక్స్ లభ్యమయితే ప్రమాదానికి గల కారణాలతో పాటు చివరి నిమిషంలో మాటలు కూడా రికార్డు అయి ఉంటాయి. వీటి కోసం చెట్లు, పుట్టలను నీలగిరి కొండల్లో వెతుకుతుతన్నారు. వాతావరణం సరిగా లేదని చెప్పినా వెళ్లడంతోనే బిపిన్ రావత్ బృందం ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడిన వరుణ్ సింగ్ ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.