తెలంగాణలో ఒడిశా ప్లాన్.. బీజేపీ సక్సెస్ సీక్రెట్
తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెంచింది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతుంది. అన్ని వ్యూహాలను రచిస్తుంది.
ఏమీ లేని చోట నుంచి అధికారం తెచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీకి మించింది లేదు. అధికారాన్ని కోల్పోవడం కాంగ్రెస్ కు గత ఎనిమిదేళ్లుగా అలవాటుగా మారితే... బీజేపీ మాత్రం వరసగా కొత్త రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ పోతుంది. తెలంగాణలోనూ అదే తరహాలో అధికారంలోకి రావాలని భావిస్తుంది. దక్షిణాదిన అధికారంలోకి రాగల రాష్ట్రం కర్ణాటక తర్వాత తెలంగాణ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇటీవల కాలంలో తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెంచింది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతుంది. అన్ని వ్యూహాలను రచిస్తుంది. కేంద్ర నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగి పరిస్థితులను అనుకూలంగా మార్చే పనిలో పడింది.
ఒడిశా తరహాలో..
మోదీ, షాల నేతృత్వంలో బీజేపీ ఇప్పటికే అనేక రాష్ట్రాలను కైవనం చేసుకుంది. తెలంగాణను కూడా తమ ఖాతాలో వేసుకోవడం పెద్ద పని కాదని అది భావిస్తుంది. అప్పటి వరకూ బలంగా ఉన్న ప్రతిపక్షాన్ని బలహీనం చేసి తొలుత ప్రతిపక్షంగా ఎదగడం బీజేపీ నేతల స్ట్రాటజీ. ఒడిశాలోనూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అక్కడ అధికారం కోసం ఎదురు చూస్తుంది. అదే తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ ను బలహీనం చేసే పనిని తొలుత ప్రారంభించింది. తొలుత బలమైన నేతలను కాంగ్రెస్ నుంచే తీసుకున్నారు.
కాంగ్రెస్ ను వీక్ చేసి...
డీకే అరుణ నుంచి (తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) అనేక మంది నేతలు కాంగ్రెస్ నేతలు బీజేపీ పంచన చేరారు. తాము ఊహించినట్లుగానే కాంగ్రెస్ ను కొంత వరకూ బలహీనం చేయగలిగారు. మానసికంగా దెబ్బ కొట్టగలిగారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ సిద్ధమయింది రేపో, మాపో ఆయన కాషాయం తీర్థం పుచ్చుకోక మానరు. గత ఎన్నికల్లో 107 నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా దక్కని బీజేపీని బలమైన నాయకులను ఆకట్టుకుని, పార్టీలోకి రప్పించుకోవడం ద్వారా బలోపేతం అవ్వాలన్న స్ట్రాటజీని బీజేపీ ఫాలో అవుతుంది.
సర్వే ద్వారా గుర్తించి....
అయినా అధికారంలోకి వచ్చే స్థాయిలో నియోజకవర్గాల్లో నేతలు లేరని అధినాయకత్వానికి తెలుసు. అందుకే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు. వారిని పార్టీలోకి తీసుకునేందుకు రెడీ అయిపోయింది. సర్వేను అనుసరించి బలమైన నేతల జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ నుంచి అందింది. గెలిచే అభ్యర్థులతో పార్టీ నేతలకు విభేధాలున్నా వారిని పార్టీలోకి తీసుకోవాలని ఆదేశించింది. గెలిచే అభ్యర్థులనే పార్టీలోకి చేర్చుకోవాలని సూచించింది. దీంతో పాటు ద్వితీయ శ్రేణి నేతలను కూడా పార్టీలోకి తీసుకుని బలోపేతం