పోలవరాన్ని సొమ్మువరంగా మార్చుకున్నారు

ప్రతీ సోమవారం పోలవరం అని చెప్పుకున్న చంద్రబాబు సోమవరాన్ని పోలవరం పేరుతో సొమ్మువరంగా మార్చుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… పోలవరం [more]

Update: 2019-04-02 06:39 GMT

ప్రతీ సోమవారం పోలవరం అని చెప్పుకున్న చంద్రబాబు సోమవరాన్ని పోలవరం పేరుతో సొమ్మువరంగా మార్చుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైందనే సాకుతో రూ.1332 కోట్లు అదనంగా చెల్లించారని పేర్కొన్నారు. చంద్రబాబు తన బినామీ ఎంపీలకు రూ.5 వేల కోట్ల పనులు కట్టబెట్టి దోచుకున్నారని అన్నారు. పట్టిసీమలో రూ.321 కోట్లు గుత్తేదారులకు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రజలకు కూడా తాగునీరు లేని దుస్థితి ఏర్పడిందదన్నారు. ధన, కుల రాజకీయాల నుంచి విముక్తి కావాలంటే బీజేపీ రావాలన్నారు. పవన్ కళ్యాణ్ సైతం కుల రాజకీయాలకే పరిమితం అయ్యారని అన్నారు. టీడీపీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఆయన రాదని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News