జీవీఎల్ పై చెప్పు విసిరిన ఆగంతకుడు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు ఆయనపై చెప్పు విసిరాడు. జీవీఎల్ [more]
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు ఆయనపై చెప్పు విసిరాడు. జీవీఎల్ [more]
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు ఆయనపై చెప్పు విసిరాడు. జీవీఎల్ ముందు చెప్పు వచ్చి పడింది. దీంతో జీవీఎల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చెప్పు విసిరన వ్యక్తి పాత్రికేయుడు శక్తి అని తెలుస్తోంది. ఆయన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన వాడని సమాచారం. అయితే, ఎందుకు అతను ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.