ఆయన రాకుంటే మా ప్రాణాలు పోయేవి
వైసీపీ గూండాలు తమపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. మాచర్లలో ప్లాన్ ప్రకారం తమను చంపాలనుకున్నారన్నారు. కారంచేడు నుంచి తమ వాహనాలను వారు [more]
వైసీపీ గూండాలు తమపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. మాచర్లలో ప్లాన్ ప్రకారం తమను చంపాలనుకున్నారన్నారు. కారంచేడు నుంచి తమ వాహనాలను వారు [more]
వైసీపీ గూండాలు తమపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. మాచర్లలో ప్లాన్ ప్రకారం తమను చంపాలనుకున్నారన్నారు. కారంచేడు నుంచి తమ వాహనాలను వారు ఫాలో అవుతున్నారన్నారు. నామినేషన్ల సందర్భంగా జరిగిన గొడవలపై తాము ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నామని భావించి తమపై దాడికి దిగారన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తమ ప్రాణాలు దక్కేవి కావని బోండా ఉమ తెలిపారు. వైసీపీ యువజన విభాగం నేత కిషోర్ ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయని చెప్పారు. మొత్తం మూడు చోట్ల తమపై దాడికి యత్నించారన్నారు. గురజాల డీఎస్పీ సమయానికి రాకుంటే తమను చంపేసే వారని బోండా ఉమ తెలిపారు.