Bonda uma : డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎమ్మెల్యే బంధువే

డ్రగ్స్ రాకెట్ లో కీలక సూత్రధారి సుధాకర్ వైసీపీ ఎమ్మెల్యే బంధువేనని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని నేరస్థుల అడ్డాగా మార్చిందన్నారు. [more]

Update: 2021-09-22 07:25 GMT

డ్రగ్స్ రాకెట్ లో కీలక సూత్రధారి సుధాకర్ వైసీపీ ఎమ్మెల్యే బంధువేనని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని నేరస్థుల అడ్డాగా మార్చిందన్నారు. 72 వేల కోట్ల హెరాయిన్ గ్యాంగ్ వెనక బిగ్ బాస్ ఎవరో చెప్పాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులు ఈ డ్రగ్స్ పై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీ పోలీసులకు అంతా తెలిసి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని బొండా ఉమ అన్నారు. డ్రగ్స్ పై టీడీపీ మాట్లాడితే కొడాలి నాని ఎందుకు ఉలిక్కిపడతారని ఆయన అన్నారు.

Tags:    

Similar News