జూన్ 22లోపు నన్ను చంపేస్తారన్న టీడీపీ నేత

తనను జూన్ 22వ తేదీ లోపు చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. తననుతో పాటు మరికొందరు టీడీపీ నేతలను హత్య [more]

Update: 2020-06-15 08:01 GMT

తనను జూన్ 22వ తేదీ లోపు చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. తననుతో పాటు మరికొందరు టీడీపీ నేతలను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఇందుకోసం కిరాయి మూకలను రంగంలోకి దించారన్నారు. టీడీపీ నేతలకు అనేక మందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. టీడీపీ నేతలకు ఏదైనా ప్రాణహాని జరిగితే అందుకు జగన్ బాధ్యత వహించాలని బోండా ఉమ అన్నారు. తాము ఈ బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

Tags:    

Similar News