నేను బ్రహ్మానందం
ప్రముఖ హాస్యనటుడు ‘నేను బ్రహ్మానందం’ అంటూ తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. విషయం తెలిసిన చిరంజీవి బ్రహ్మానందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తన ఇంటికి పిలిచి శాలువ కప్పి తన సహనటుడ్ని సన్మానించారు మెగాస్టార్. బ్రహ్మానందం ఆత్మకథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిరంజీవి పేర్కొన్నారు.
ప్రముఖ హాస్యనటుడు ‘నేను బ్రహ్మానందం’ అంటూ తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి బ్రహ్మానందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తన ఇంటికి పిలిచి శాలువ కప్పి తన సహనటుడ్ని సన్మానించారు మెగాస్టార్. బ్రహ్మానందం ఆత్మకథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.
నలభై ఏళ్లకు పైగా ప్రేక్షకులను నవ్విస్తున్న ఈ కామెడీ స్టార్ దాదాపు వేయికి పైగా సినిమాల్లో నటించారు. మూడు తరాల ప్రేక్షకుల ముఖాలపై బ్రహ్మానందం చెరగని చిరునవ్వు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక కాలం పాటు స్టార్ కమెడియన్‌గా వెలిగిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు.