లాక్ డౌన్ పెట్టాలా? వద్దా? తేల్చుకోలేకపోతున్న కేసీఆర్
హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలకు వెళుతున్నారు. [more]
హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలకు వెళుతున్నారు. [more]
హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలకు వెళుతున్నారు. పదిహేను రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని కేసీఆర్ కు వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. అయితే లాక్ డౌన్ మళ్లీ విధిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై గత మూడురోజులుగా కేసీఆర్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కేసీఆర్ కు నివేదిక ఇవ్వనున్నారు. లాక్ డౌన్ పదిహేను రోజుల పాటు హైదరాబాద్ లో విధిస్తే ఆర్థికంగా ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొనాల్సి వస్తుందన్న దానిపై కేసీఆర్ అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మరోవైపు దినసరి కూలీలు, వలస కార్మికుల పరిస్థితిపై కూడా ఆయన కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు. మంత్రి వర్గ సమావేశం తర్వాతే కేసీఆర్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది.