ఆ నమ్మకంతోనే రాజధాని రైతులు

ప్రభుత్వం దిగిరాదని తెలిసినా రాజధాని అమరావతి రైతులు మాత్రం ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. వారి ఆందోళనలు 72వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ వైఖరి రాజధాని రైతులకు స్పష్టంగా [more]

Update: 2020-02-27 02:50 GMT

ప్రభుత్వం దిగిరాదని తెలిసినా రాజధాని అమరావతి రైతులు మాత్రం ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. వారి ఆందోళనలు 72వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ వైఖరి రాజధాని రైతులకు స్పష్టంగా తెలుసు. ఇప్పటికే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది నాటికి అక్కడి నుంచే సచివాలయం ప్రారంభమవుతుందంటున్నారు. అయినా రాజధాని రైతులు మాత్రం ధైర్యం సడలకుండా దీక్షలు చేస్తూనే ఉన్నారు. మందడం, తుళ్లూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నేతలపాడు, తాడికొండ తదితర ప్రాంతాల్లో దీక్షలు 72వ రోజుకు చేరుకున్నాయి. వారికి ఒక్కటే నమ్మకం. న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని. అందుకోసమే రాజధాని రైతులు కోర్టులపై నమ్మకంతో దీక్షలు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News