కట్టలు కట్టలు కరెన్సీ నోట్లు.. ఎక్కడివి?

ఈఎస్ఐ స్కాం లో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గుట్టలుగుట్టలుగా డబ్బులు బయటపడుతూనే ఉన్నాయి.. వారం రోజుల క్రితమే నాలుగు కోట్ల పైచిలుకు డబ్బులను సీజ్ [more]

Update: 2020-09-12 02:57 GMT

ఈఎస్ఐ స్కాం లో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గుట్టలుగుట్టలుగా డబ్బులు బయటపడుతూనే ఉన్నాయి.. వారం రోజుల క్రితమే నాలుగు కోట్ల పైచిలుకు డబ్బులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులకు మళ్లీ విస్తుపోయే రీతిలో డబ్బులు కట్టలు దొరికాయి. ఈసారి ఏకంగా రెండు కోట్ల 47 లక్షల రూపాయల నగదు దొరికింది. ఈ ఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి తోపాటు ఫార్మసిస్ట్ నాగమణి లకు చెందిన డబ్బులను అధికారులు సీజ్ చేశారు. దేవికారాణి ఇంట్లో కోటి 29 లక్షల రూపాయల నగదు లభ్యమైంది. దీంతోపాటు 65 లక్షల రూపాయలను వివిధ అకౌంట్ ద్వారా బదిలీ చేసినట్లు తేలింది. దీనికి సంబంధించిన నగదును కూడా అధికారులు సీజ్ చేశారు. మరోవైపు నాగమణికి 35 లక్షల రూపాయల నగదు బదిలీ చేసినట్లుగా బయటపడింది.

వారం రోజుల్లో 8 కోట్లు….

వీటికి సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల నగదు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. అయితే ఈ నగదుతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కమర్షియల్ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారు. దేవికారాణి తో పాటు కలిసి ఒక బిల్డర్స్ కు పెద్ద మొత్తంలో నగదును చెల్లించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఆధారాలు బయటపడడంతో రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మరో కేసు ను దేవికా రాణి పై నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఈ నగదు మొత్తం కూడా బినామీ పేర్ల మీద బదిలీ చేయడం గమనార్హం. దేవికారాణి ఆమె కుటుంబ సభ్యులు కలిసి పెద్ద మొత్తంలో బినామీ అకౌంట్లు ఉన్నాయి. ఈ అకౌంట్ ద్వారా డబ్బులను బదిలీ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా ఎవరికి బదిలీ చేశారన్న దానిపైన అధికారుల విచారణ కొనసాగుతోంది.

Tags:    

Similar News