వివేకా హత్య కేసు.. సీబీఐ స్టార్ట్
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల నుంచి సీబీఐ వివరాలను సేకరించింది. వివేకానందరెడ్డి గత [more]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల నుంచి సీబీఐ వివరాలను సేకరించింది. వివేకానందరెడ్డి గత [more]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల నుంచి సీబీఐ వివరాలను సేకరించింది. వివేకానందరెడ్డి గత ఏడాది మార్చి లో హత్యకు గురైైన సంగతి తెలిసిందే. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఈ హత్య కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు. అయితే వివేకా కుటుంబ సభ్యులు ఈ హత్యకేసున సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ రంగంలోకి దిగని సీబీఐ అధికారులు నిన్నటి నుంచి విచారణ ప్రారంభించారు. సీబీఐ విచారణలోనైనా వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరో తెలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.