బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వారిని ఎలా తరలించాలన్న దానిపై రెండు రాష్ట్ర [more]
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వారిని ఎలా తరలించాలన్న దానిపై రెండు రాష్ట్ర [more]
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వారిని ఎలా తరలించాలన్న దానిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోవాలని చెప్పింది. ఇతర రాష్ట్రంలోకి రాగానే వారికి పరీక్షలు చేసి మాత్రమే అనుమతించాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్ లో ఉంచాలని తెలిపింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులకు, వలస కూలీలకు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలు చిక్కింది. వీరితో పాటు లాక్ డౌన్ లో చిక్కుకుకపోయిన పర్యాటకులకు కూడా ఇది వర్తించనుంది. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే ఆయా రాష్ట్రాల్లోకి అనుమతించాలన్న నిబంధనను విధించింది.