హైకోర్టు తరలింపు పై రాజ్యసభలో
ఏపీ హైకోర్టు తరలింపు అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం, హైకోర్టుతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతి [more]
;
ఏపీ హైకోర్టు తరలింపు అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం, హైకోర్టుతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతి [more]
ఏపీ హైకోర్టు తరలింపు అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం, హైకోర్టుతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రతిపాదన ఎంతవరకూ వచ్చిందన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఏపీ ప్రభుత్వం నుంచి హైకోర్టు తరలింపు ప్రతిపాదన తమకు అందిందన్నారు. తరలింపు నిర్ణయం హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదేనని సమాధానమిచ్చారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు.